చాలామంది స‌మ‌స్య‌గా భావించే వ్య‌స‌నం మూలం మెద‌డుకు సంబంధించిన‌దేన‌ని అమెరిక‌న్ సొసైటీ ఆఫ్ అడిక్ష‌న్ మెడిస‌న్‌(ఏఎస్ఏఎం) పేర్కొంది. మాద‌క‌ద్ర‌వ్యాల వాడ‌కం, పొగ‌తాగ‌డం, మ‌ద్యం, సెక్స్‌, జూదం వంటి వ్య‌స‌నాలను చాలామంది స‌మ‌స్య‌గా భావిస్తార‌ని, అయితే ఇది మెదడులోని జ్ఞాప‌క‌శ‌క్తి, ప్రేరేప‌ణ వంటి వ్య‌వ‌స్థ‌ల‌కు సంబందించిన రుగ్మ‌త అని ఏఎస్ఏఎం తెలిపింది. ఇవి కేవ‌లం శారీర‌క చ‌ర్య‌లు మాత్ర‌మే కాద‌ని, మెద‌డులో ఒక త‌ప్పుడు భావ‌న బ‌ల‌వంతంగా ఇలా చేయిస్తుంద‌ని ఏఎస్ఏఎం మాజీ అధ్య‌క్షుడు మైఖేల్ పేర్కొన్నారు. వ్య‌స‌నం మాద‌క ద్ర‌వ్యాల స‌మ‌స్య కాద‌ని, అది పూర్తిగా మెద‌డుకు సంబంధించిన స‌మ‌స్య అని ఆయ‌న వివ‌రించారు. వ్య‌స‌న‌మ‌నేది మెద‌డ‌కు సంబంధించిన స‌మ‌స్య అని న్యూరో సైంటిస్టులు మొద‌టి నుంచి చెబుతూనే వ‌స్తున్నారు. ఇప్ప‌డు ఇదే విష‌యాన్ని ఏఎస్ఏఎం తాజాగా నిర్ధారించిన‌ట్ట‌యింది.