గజల్‌ శ్రీనివాస్‌, మాధవీలత జంటగా నటించిన చిత్రం‘అనుష్ఠానం. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ సినిమా ఆడియోను విడుదల చేశారు. లగడపాటి శ్రీధర్‌ విడుదల చేసిన ఆడియో సీడీని తమ్మారెడ్డి భరద్వాజ్‌ మొదట అందుకున్నారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య బంధాలను తెలిపే చక్కని కుటుంబ కథా చిత్రం అనుష్ఠానం అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కృష్ణవాసా దర్శకత్వం వహించగా రవిరాజ్‌రెడ్డి నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, బెంగాలీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.