ధూమ్ సిరీస్‌లో భాగంగా వస్తున్న ధూమ్-4 సినిమాలో తాను నటించడం లేదని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తేల్చిచెప్పాడు. యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటీలు నటిస్తున్నట్టు బాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేశాయి. ఈ సినిమాలో హృతిక్ కూడా నటిస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, అదంతా ఒట్టిదేనని హృతిక్ కొట్టిపడేశాడు. ఈ విషయమై అభిమానులకు ట్విటర్‌లో క్లారిటీ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం తాను రెండు సినిమాలకు అంగీకరించానని అందులో ఒకటి కాబిల్ అని, మరోటి యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్‌పై వస్తున్న విక్టర్ అని తెలిపాడు. యామీ గౌతమ్‌తో కలిసి నటిస్తున్న కాబిల్ సినిమా వచ్చే జనవరిలో సెట్స్‌కు వెళ్తుందని పేర్కొన్నాడు.