పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, కాజల్ జంటగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించగా శరత్ మరార్, సునీల్ లుల్లూ నిర్మాతలు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. సింగిల్ కట్ కూడా లేకుండా సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు చిత్ర బృందం పేర్కొంది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను ఈ చిత్రంతో ఆనందంగా జరుపుకోవాలని కోరింది.