వేసవిలో ఎండ వేడిమి, దుమ్ము చర్మపు రంగును, తాజాదనాన్ని తగ్గిస్తాయి. వేసవి కాలంలో చర్మం నిగారింపు కోల్పోకుండా ఈ కూల్ ఫ్యాక్స్ వేసుకుంటే సరి.


పుదీనా ప్యాక్:

  • గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి.
    పుదీనా ఆకులతో ఫేస్ట్ తయారు చేసుకోవాలి.
    పుదీనా పేస్ట్‌లో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి.
    15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.

 

 

బాదం నూనె ప్యాక్:

  • బాదం నూనెలో దూదిని ముంచాలి.
    ముఖం మీద, కళ్ల కింద, మెడ, గొంతు, చేతులపై మృదువుగా రాయండి.
    అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

 

ఎర్రకందిపప్పుతో ప్యాక్:

  • 50 గ్రాముల ఎర్రకందిపప్పులో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి.
    మెత్తగా రుబ్బి, దీంట్లో పచ్చిపాలు, బాదం నూనె కలపాలి.
    ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి.
    తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

 

దోసకాయ గుజ్జుతో ప్యాక్:

  • దోసకాయ గుజ్జులో టేబుల్ స్పూన్ పంచదార కలపాలి.
    దీన్ని ఫ్రిజ్‌లో చల్లబడేవరకు ఉంచాలి.
    తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి.
    పది నిమిషాల తర్వాత కడిగేయాలి.

ఈ కూల్ ప్యాక్స్‌తో వేసవిలో ముఖ సౌందర్యం కాపాడుకోవచ్చు.