సెకెండ్ హ్యాండ్ స్మోకింగ్ లేదా పాసివ్ స్మోకింగ్‌తో మానసిక రుగ్మతలకు లోనయ్యే ప్రమాదం ఉన్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆర్క్చూస్ ఆఫ్ జనరల్ సైకియాట్రీ అనే పత్రికలో అధ్యయనానికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. పొగతాగే వాళ్ల మధ్య ఉండడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఇప్పటి వరకు తేలగా తాజాగా మానసిక రుగ్మతలు కూడా వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనకారులు కనుగొన్నారు. అధ్యయనం కోసం 5,500 మంది పొగతాగని వాళ్లని ఎంచుకుని వారిని పాసివ్ స్మోకింగ్ మధ్య ఉంచారు. ఆరేళ్లపాటు వారిని అధ్యయనం చేయగా వారిలో సగానికిపైగా మానసిక రుగ్మతలతో బాధపడుతుండడాన్ని అధ్యయనకారులు గుర్తించారు. మానసిక రుగ్మతలకు గురైన వారిలో కొందరు డెలీరియం, ఒత్తిడి, స్కిజోఫ్రేనియా వంటి వాటితో బాధపడుతున్నట్టు గుర్తించి చికిత్స అందించారు.