హైదరాబాద్‌: తెలంగాణ విద్యార్థులకు ఐబీఎం సంస్థ ఆధునిక ఐటీ కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. తెలంగాణ నైపుణ్య విజ్ఞానాభివృద్ధి సంస్థ అయిన టాస్క్‌ ఐబీఎం సంస్థతో ఈమేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ జిల్లాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులకు డేటా ఎనలిటిక్స్‌, బిగ్‌ డేటా వంటి ఆధునిక సాంకేతిక అంశాల్లో ఐబీఎం శిక్షణ ఇస్తుంది.