ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ ను వరదలు వణికిస్తున్నాయ్. భారీగా కురుస్తున్న వర్షాలకు భాగీరథి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో చార్ ధామ్ యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. గంగోత్రి - గోముఖి మధ్య నాలుగు రోజులుగా చిక్కుకున్న యాత్రికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయ్. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు, అటవీశాఖ సిబ్బంది యాత్రికులను సురక్షితంగా నదిని దాటించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ చరియలు విరిగి పడుతుండడంతో రహదారులు మూసుకుపోయి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.