పెళ్లికాని అమ్మాయిలు తరచూ కొన్ని మాటలను ఇష్టం ఉన్నా లేకున్నా వినాల్సి వస్తోందని, అవి వినీవినీ వారు విసిగిపోతారని ఓ అధ్యయనంలో తేలింది. పెళ్లికాని అబ్బాయిల సంగతెలా ఉన్నా 25 ఏళ్లు దాటినా పెళ్లి కాని అమ్మాయిలు కుటుంబ సభ్యుల సహా తెలిసినవారు, స్నేహితుల నుంచి తరచూ కొన్ని మాటలు వినాల్సి వస్తుంటుందట. ఎక్కడికెళ్లినా అటువంటి మాటలే వినిపిస్తుండడంతో అమ్మాయిలు ఆ మాటలు వినీవినీ విసిగిపోతారట. తాము వెళ్లినచోట అటువంటి మాటలు వినిపించకుండా ఉంటే బాగుంటుందని మనదేశంలోని అమ్మాయిలు అనుకుంటారట. ఇంతకీ వారు వినకూడదని కోరుకునే ఆ మాటలేంటో తెలుసా..?


* ఎక్కువగా ఆలోచించకుండా త్వరగా పెళ్లి చేసుకో
* తొందరగా పిల్లలు పుట్టకపోతే కష్టం
* వయసు పైబడితే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి
* కెరీర్ ఓరియెంటెడ్‌గా ఉండొద్దు
* పెళ్లి చేసుకోని అమ్మాయిలు తమ తల్లిదండ్రులను సరిగా చూసుకోలేరు
* మాకు మనవళ్లు ఉంటే ఎంత బాగుండేదో
* అల్లుడనేవాడుంటే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు
* ఏం బాధపడవద్దు.. దేవుడు అంతా మంచే చేస్తాడు
* కెరీర్‌దేముంది కొంచెం ఆలస్యంగా ప్రారంభించినా ఏం కాదు..
* పిల్లల విషయంలో ఆలస్యమైతే మాత్రం కష్టం
.. సరిగ్గా ఇవే విషయాలను తమ కుమార్తెలకు తరచూ చెబుతుంటారట.